ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మంగళవారం ఢిల్లీ, లక్ నౌ మధ్య పోరు సాగనుంది. పాయింట్లు పట్టికలో ఈ రెండు జట్లు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీకి ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందులో విజయం సాధిస్తే ఏడు విజయాలతో 5వ స్థానానికి చేరుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే నెట్వర్క్ రేట్ లో మైనస్ లో ఉన్న కారణంగా నేరుగా ఎలిమినేట్ అవుతుంది. లక్ నౌ కు ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. నేడు ఢిల్లీ పై గెలిస్తే ఆ తర్వాత ముంబై పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరెండు జట్ల మధ్య జరిగే పోరు మిగతా జట్లపై ప్రభావం చూపనున్నాయి. చెన్నై, సన్ రైజర్స్ తమ తర్వాత మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు లక్ నౌకు ఛాన్స్ ఉంటుంది. నేటీ మ్యాచ్లో లక్నో ఓడితే దాదాపు పుష్కరించినట్లే. లక్నో తర్వాత రెండు మ్యాచ్లో గెలిస్తే దాని ప్రభావం హైదరాబాద్ కంటే చెన్నై పై ఎక్కువ. చెన్నై ఇంకో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్ తప్పక విషయం సాధిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లాల్సి ఉంటుంది. నేటి మ్యాచ్ ఫలితం బెంగళూరు పై కూడా ప్రభావం ఉంది.
నేడు ఢిల్లీ, లక్ నౌ మధ్య పోరు.. మిగతా జట్లపై ప్రభావం..
- Advertisment -