అహ్మదాబాద్: భారత ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఆహ్మదాబాద్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు అతిరథ మహామహులు హాజరు కానున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాధిత్య సింధియా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ, భారత్ లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్ హాజరవుతున్నారు. ఫైనల్ మ్యాచ్ కు ముందు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైన ముందు పది నిమిషాల పాటు వైమానిక దళం విన్యాసాలు చేయనుంది. 9 ఎయిర్ క్రాఫ్ట్ ల బృందం సూర్యకిరణాలు టీం ఈ వేడుకల్లో కనువిందు చేయనుంది.
నేడే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్.. హాజరయ్యే ప్రముఖులు వీరే..
- Advertisment -