–హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యే
బెజ్జంకి టౌన్, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసే విగ్రహాన్ని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లు సోమవారం ఆవిష్కరించనున్నారు.
అనంతరం పాపయ్యపల్లి గ్రామంలో పునర్నిర్మాణం కావించబడ్డ హనుమాన్ దేవాలయ ఉత్సవాలను సైతం ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలు సోమవారం నుండి బుధవారం వరకు కొనసాగనున్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదివారం నిర్వాహకులు మంత్రిని ఎమ్మెల్యేను కలిసి కోరినారు. ఈ మేరకు ఆదివారం చత్రపతి శివాజీ విగ్రహాన్ని డబ్బు చప్పులతో మహిళలల కోలాటాలతో బెజ్జంకి మండల కేంద్రం నుండి ఊరేగింపుగా పాపయ్యపల్లికి తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు గ్రామ ప్రజలు చిన్నారులు పాల్గొన్నారు.