Wednesday, September 18, 2024

నేటి నుండి స్ఫెషల్‌ ఆఫీసర్ల పాలన..

  • ముగిసిన ఎంపీటీసీ, ఎంపీపీల పదవీ కాలం
  • రేపటితో జడ్పీటీసీ, ఛైర్మన్ల గడువు పూర్తి
  • నిధులు విడుదల కాక, పనులు పూర్తి కాక..
    అసంతృప్తిలో నేతలు

జనత న్యూస్‌
తెలంగాణలో ఎంపీటీసీ, ఎంపీపీల పదవీ కాలం నిన్నటితో ముగిసింది.ఆలస్యంగా ఎన్నికలు జరిగిన ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని ఎంపీపీలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌ ఎంపీపీ, మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల, బయ్యారం ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట ఎంపీపీలు మినహాయించి..రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. వారి స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మండల పరిషత్‌కు ఎంపీడీవోపై స్థాయి ర్యాంకు అధికారి ప్రత్యేక అధికారిగా కొనసాగేలా ఉత్తర్వూలు జారీ చేశారు పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా.
గురువారంతో జడ్పీటీసీ, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఛైర్‌ పర్సన్ల పదవీ కాలం ముగియనుంది.వారి స్థానంలో శుక్రవారం నుండి ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వూలు వెలువడడంతో, కలెక్టర్లు ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు.
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక పాలన
ఉమ్మడి జిల్లాలోని 58 మంది ఎంపీపీలు, 680 మంది ఎంపీటీసీల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. నేటి నుండి వారి స్థానంలో ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 15 మండలాల్లో 178 మంది ఎంపీటీసీలు, పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో 138 మంది ఎంపీటీసీలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల్లో 123 మంది, జగిత్యాల జిల్లా లోని 18 మండలాల్లో 214 మంది ఎంపీటీసీల పదవీ కాలం బుధవారంతో ముగిసింది.నేటి నుండి వారు మాజీలుగా కొనసాగుతారు.వారి స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగించనున్నారు.
నేతల్లో అసంతృప్తి..
పదవీ కాలం ముగించుకున్న ఎంపీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒకవైపు నిధులు మంజూరు కాక, మరోవైపు అభివృద్ధి జరుగక పోవడంతో నిస్తేజంలో ఉన్నారు.15వ పంచవర్ష ప్రణాళిక రెండో విడుత నిధులతో పాటు సాధారణ, స్ఫెషల్‌ ఫండ్‌, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ మంజూరు కావక పోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మండలాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జనరల్‌ ఫండ్‌తో పాటు ప్రత్యేక నిధులు మంజూరు కాక పోవడంతో, కనీసం కార్యాలయాలు కూడా నిర్మించుకోలేని దుస్థితి నెలకొంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page