తిరుమల తిరుపతి దేవస్థానానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుండగా ఆ తరువాత ఇక్కడి ప్రసాదం (లడ్డు)కు ఇస్తారు భక్తులు. ఎవరైనా తిరుపతికి వెళితే..తమవంతు హుండీలో వేయమని కొంత డబ్బు ఇచ్చేవారు, వచ్చేటప్పుడు లడ్డు ప్రసాదం తీసుక రామ్మని వేడుకోవడం చూశాం. తిరుపతి లడ్డుకు 300ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు. 1715లో ఇక్కడ మొదటి సారి లడ్డు తయారు చేసి ప్రసాదంగా భక్తులకు అందజేసే వారట. కాల క్రమేనా తాజాగా రోజుకు మూడు లక్షల లడ్డూలు తయారౌతూ ఏటా సుమారు 500 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచన. అయితే టీటీడీ చరిత్రలో ఆరు సార్లు మాత్రమే మార్చబడినట్లు చెబుతారు. 2016 టీటీడీ నివేదిక ప్రకారం లడ్డూలకు దివ్యమైన సువాసన ఉంటుదని, బెల్లం సిరప్‌తో చేసిన బూందీ ప్రసాదం యొక్క షెల్ఫ్ జీవిత కాలాన్ని పెంచడానికి పెంచబడుతుందట. ఆ తరువాత, బాదం, జీడిపప్పు ,ఎండుద్రాక్షలు, రుచి పోషక విలువలను మెరుగుపరచడానికి అదనంగా చేర్చారు. జూలైలో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఏజీ డెయిరీ ఫుడ్స్ సరఫరా చేసే నెయ్యిలో కొవ్వు ఉన్నట్లు నిర్ధారించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఏజీ డెయిరీ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేసి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు మార్చింది. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కాంట్రాక్టర్ నుంచి కిలో నెయ్యి కోసం టీటీడీ రూ.320 చెల్లిస్తుండగా, ఇప్పుడు కర్ణాటక నుంచి కిలో రూ.475 చొప్పున కొనుగోలు చేస్తోంది టీటీడీ . జూన్‌లో టీటీడీ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును టీడీపీ ప్రభుత్వం నియమించింది. లడ్డు నాణ్యత ప్రమాణాలపై ఆయన విచారణ చేపట్టారు.
తిరుపతి లడ్డూ చరిత్ర ఇదీ..

- Advertisment -