తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరిని దారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచారం చేస్తున్నట్లు కనిపించినట్లు భక్తులు తెలిపారు. దీంతో భక్తుల వారు భయంతో పరుగెడుతూ కేకలు వేశారు. భక్తుల కేకలు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి. అప్రమత్తమైన తిరుమల భద్రతా సిబ్బంది నడక దారిలో వెళ్లే భక్తులను గుంపు గుంపులుగా పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అటవీశాఖ కూడా చిరుతలను కనుగునేందుకు చర్యలు మొదలుపెట్టారు. గతంలో అలిపిరి నడకదారిలో చిరుత బాలుడిపై దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
- Advertisment -