తిమ్మాపూర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండల కేంద్రంలో పోలీసులు సాయుధ బలగాలతో కలిసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం సిఆర్పిఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా తిమ్మాపూర్ సిఐ కర్రె స్వామి మాట్లాడుతూ మండలంలోని ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిన తమకు సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు గాని వ్యక్తులు గాని , ఓటర్లను బెదిరించడం గాని , మభ్యపెట్టడం గాని చేసినట్లయితే అట్టి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని, లేదంటే సీ విజిల్ ఆప్ లో ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు దారుని వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ఎన్నికలనియమావళిని ఎవరు ఉల్లంగించవద్దని తెలిపారు. గ్రామాలలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వాట్సాప్ ఫేస్బుక్ లలోఅసభ్యకరమైన, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల ను కూడా బాధ్యులను చేస్తామని, కులం, మతం పేరుతో పోస్టులు పెడితేచట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో సీఐఎస్ఎఫ్ అధికారి విక్రాంత్ షాకీన్, కవాతు టీం ఆర్ఎస్ఐ రాజు, తిమ్మాపూర్ ఎస్ఐ చేరాలు, పోలీస్ సిబ్బందితో పాటు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..