సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ ను కొనుగోలు చేసి నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది .2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మించారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ కథాంశం తో వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మార్చి ఆకరుణ విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఓటీటీ లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. ఎప్పుడంటే?
- Advertisment -