Saturday, March 14, 2026

పోలీస్ పెట్రో ఫిల్లింగ్ స్టేషన్‌కు మూడు అవార్డులు

వరంగల్ , జనత న్యూస్:  తెలంగాణ రాష్ట్ర డీలర్స్‌ అవార్డ్స్‌ 2023`24 సంవత్సరానికి వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ విభాగం అధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ వెల్ఫెర్‌ సోసైటీ వరంగల్‌ కాకతీయ ఫిల్లింగ్‌ స్టేషన్‌ మూడు అవార్డులను కైవసం చేసుకోని చాంఫియన్‌ ఆఫ్‌ చాంఫియన్స్‌గా నిలిచింది. ప్రతి ఏడాది భారత్‌ పెట్రోలియం సంస్థ డీలర్స్‌కు ప్రకటించే అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది వాహనదారులకు అందించే పెట్రోలు, డిజిల్‌ నాణ్యత, తూనికలు, పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌ నిర్వహణలో వరంగల్‌ టెరిటోరియల్‌ లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఉత్తమంగా నిల్వడంతో భారత్‌ పెట్రోలియం సంస్థ పోలీస్‌ పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌కు మూడు అవార్డులతో పాటు చాంఫియన్‌ ఆఫ్‌ చాంఫియన్స్‌ షీల్డ్‌ను అందజేయడం జరిగింది. ఈ  సందర్బంగా పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఇంచార్జ్‌ సురేంద్రతో పాటు, సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌, కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ రెడ్డిలకు పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేసారు. అనంతరం  పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌ అధికారులు, సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ అభినందనలు తెలియజేస్తూ నాణ్యమైన పెట్రో ఉత్పత్తులను అందజేసి వాహనదారులు అభిమానాన్ని సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఈ పెట్రో ఫిల్లింగ్‌ స్టేషన్‌ ద్వారా ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా వుందన్నారు.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page