Cyber Crime: సిద్దిపేట,జనత న్యూస్: ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని సిద్ధిపేట త్రీటౌన్ ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. సిద్ధిపేట మండలంలోని పొన్నాల గ్రామ శివారులోని వెంకట సాయి నర్సింగ్ స్కూల్ విద్యార్థినిలకు సైబర్ నేరగాళ్ళు పాల్పడే ఆర్థిక నేరాలు,ఆర్థికేతరా నేరాలపై ఆయన బుధవారం అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు ఓటీపీ ఫ్రాడ్స్,బయోమెట్రిక్,క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్,ఆన్లైన్ పే మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్,ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి,నకిలీ సిమ్ కార్డ్స్,లోన్ యాప్స్,నకిలీ వెబ్ సైట్స్ వల్ల జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు,చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ పుష్ప, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆన్ లైన్ లో మోసపోయిన వారు ఈ నెంబర్ కు కాల్ చేయండి..
- Advertisment -