9 నెలల్లో కాంగ్రెస్ చేసిందేమిటి ?
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా లక్ష్యం
మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు
హైదరాబాద్ :
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ లతో పాటు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయించామని, రైతుకు కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించామని, ముద్రా రుణపరిమితిని పెంచినట్లు తెలిపారు. రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నామని, 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేసిట్లు తెలిపారు. మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించామని, బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించినట్లు వివరించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, 6 గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు. 9 నెలల మీ పాలనలో నెరవేర్చిన హామీలపై సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ ను క్షమించబోరని అన్నారు. మోదీ 100 రోజులపాటు రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ కోసం రూ. 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులను రూపొందించినట్లు తెలిపారు. 50 వేల 600 కోట్ల రూపాయలతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ కారిడార్లను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. న్యాయంపై దృష్టి సారించి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టడంతోపాటు పేపర్ లీక్‌లను నివారించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
100 రోజుల్లో..ఇదీ మా ప్రోగ్రెస్ …

- Advertisment -