హన్మకొండ పరిశ్రమల కేంద్రం అధికారిపై..
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
మూడు నెలల్లో డిజిటలైజేషన్ కావాలని హుకుం
హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి
హన్మకొండ-జనత న్యూస్
హన్మకొండ రాష్ట్ర పరిశ్రమలు`మౌళిక సదుపాయాల కార్యాలయాన్ని తనిఖీ చేశారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఇది ఆఫీసంటారా..? ఇందులోఉంటూ ఎలా పనిచేస్తున్నారు’ అంటూ అధికారులు, సిబ్బందిపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్`హన్మకొండ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మూడు నెలల్లో ఈ కార్యాలయల ఆయా విభాగాలను డిజిటలైజేషన్ చేయాలని, అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పారిశ్రామిక కారిడార్‌లో ఎంక్రోచ్‌మెంట్లు ఉంటే తొలగించాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా..కార్యాలయాలు ఇంకా అద్వాన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాము ఎలాంటి వాతావరణంలో పని చేస్తున్నామో..కార్యాలయాల్లో సైతం అలాంటి వాతావరణం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హన్మకొండ లోని ర్యాక్స్ ఐటీ పార్కును ఎమ్మెల్యేతో కలసి ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు.