కొత్త సినిమాలు, అందులో అభిమాన హీరో సినిమా చూడాలంటే అభిమానులు, ప్రేక్షకుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. నిర్మాణ వ్యయం పెరిగిందని థీయేటర్లలో టికెట్ల ధరలు పెంచుతూ పోతున్నారు. తాజాగా..ఈ నెల 27న విడుదల కానున్న దేవర సినిమా టికెట్ల ధరలు పెరుగనున్నాయి. కొరిటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కోసం..ఎదురు చూస్తున్న అభిమానులకు చేదు వార్త వినిపించింది. అయితే టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ఈ సినిమా 27న మార్నింగ్ షోతో రిలీజ్ అవుతుందని భావించారు. కాని 26న అర్థరాత్రి 1గంట షో వేయడం విశేషం. రాష్ట్రంలో 29 థీయేటర్లలో అర్థ రాత్రి షో వేయనున్నారు. ఈ షోకు రూ. 100 అదనంగా వసూలు చేయనున్నారు థీయేటర్ యజమానులు. సింగిల్ స్క్రీన్ థీయేటర్లలో రూ.25, మల్టీ ప్లెక్స్ లలో రూ. 50 ల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు.
ఇదేం..‘దేవర’

- Advertisment -