Thirumala :తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తరలివచ్చారు. నిన్న మొత్తం 72,256 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,021 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు ఆలయ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 16న రథ సప్తమి ఉన్నందున భక్తులు మరింత పెరుగుతారని అంటున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ మాఘ శుద్ధ సస్తమి సూర్య జయంతి రోజున రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తారు.
Thirumala : తిరుమలలో భక్తుల రద్దీ
- Advertisment -