Thursday, September 19, 2024

అటవీ ప్రాంత ఆడబిడ్డల కష్టాలు వారికేం తెలుసు :పుట్ట మధు

మంథని,  జనతా న్యూస్: అటవీ ప్రాంతాల్లోని అడబిడ్డల కాన్పు కష్టాలను పట్టించుకోని చరిత్ర కాంగ్రెస్‌పార్టీకే దక్కుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా పరిషత్‌ చైర్మన్ పుట్ట మధు  అన్నారు. మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ తో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక ఏండ్లు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వివిధ పదవులు పొందినా ఏనాడు మన కష్టాలు పట్టించుకోలేదని, మన కన్నీళ్లు తుడువలేదన్నారు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే అటవీ ప్రాంతాల్లోని ఆడబిడ్డలు కాన్పు కోసం వాగులు దాటే పరిస్థితి లేక అనేక అవస్థలు పడ్డారని వాగు కాడనే ప్రసవించిన ఆడబిడ్డ వైద్యులు లేక బిడ్డ పేగును బండ రాళ్లతో తెంపిన సంఘటనలు ఉన్నాయని ఇన్ని కష్టాలు గత పాలకుల పుణ్యమేనని ఆయన గుర్తు చేశారు.

ఈనాడు అలాంటి పరిస్థితులులేవని తనకు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలనే ఆలోచన చేశానే తప్ప ఏనాడు అధికారం, పదవులు కోసం ఆశించలేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తనపై అనేక అసత్య ప్రచారాలు చేస్తే నమ్మి తనను దూరం చేసుకున్నారని అయినా తాను ఏనాడు ఈ ప్రాంత గురించి ఆలోచన మానుకోలేదన్నారు. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయంటే పార్టీ మానీపేస్టోలో పొందుపర్చిన పథకాలను చెబుతున్నారే తప్ప నాటి నుంచి నేటి వరకు ఏం చేశారో ఇంకా ఏం చేస్తారో చెప్పుకోలేని దుస్థితి కాంగ్రెస్‌ పార్టీ ది అని ఆయన ఎద్దేవా చేశారు.

మన అవసరాలు, మన ఆకలి తీర్చాలని ఆ కుటుంబం ఏనాడు ఆలోచన చేయలేదని, కేవలం మన ఓట్లతో అధికారంలోకి రావాలన్నదే వాళ్లు ఆశయం అని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉంటూ అనేక పదవులు పొందినోళ్లు ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారని ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం చేస్తారో చెప్పడం లేదని, కనీసం పేద వర్గాలకు సాయం చేస్తామని కూడా చెప్తలేరని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ మేనీఫెస్టో పథకాలు తప్ప తమ స్వంతంగా పేద ప్రజలకు సాయం చేస్తామని చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పటి వరకు ఆ కుటుంబం ఈప్రాంత ప్రజలకు ఏం చేసిండ్లో మళ్లా ఏం చేస్తరో కూడా చెప్పుకోలేదని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.కానీ తాను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసే పథకాలతో పాటు తాను సొంతంగాఓ మానీపెస్టోకు రూపకల్పన చేశానని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంథని, కాటారం కేంద్రాలుగా పేదింటి ఆడబిడ్డలకు పెండ్లళ్లు చేస్తామని పేదబిడ్డల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లో రెండు హస్టల్‌ వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదివించేలాఏర్పాట్లు చేస్తునట్లు చెప్పారు. ఇప్పటికే పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించామని అదే రీతిలోమరిన్ని సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడాదికి గృహలక్ష్మి పథఖం ద్వారా మూడు వేల ఇండ్లు మంజూరీ చేస్తామని ప్రకటించారని, అయితే తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఏడాదికి ఐదు వేల మంజూరీ చేసేలా ప్రయత్నం చేసి గూడు లేని ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తానని అన్నారు.ప్రభుత్వం అందించే నిధులకు తాను కొంత సాయం అందిస్తానని, ఇండ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించి దగ్గరుండి గృహప్రవేశాలు చేయిస్తామని హమీ ఇచ్చారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని ఆయనహమీ ఇచ్చారు.తాను ఏనాడు ఇచ్చినమాట తప్పలేదని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతప్రజల కోసం నిరంతరం పని చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.గ్యారెంటీ లేనిపథకాలతో ముందుకు వచ్చే కాంగ్రెస్సోళ్ల మాటలను నమ్మితే మోసపోక తప్పదని, ఇప్పటికే ఐదేండ్లు వెనుకబాటుకు గురయ్యామని, అలాంటి పరిస్థితిని మరోమారు తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో వివిధ సర్వేలు రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని సీఎం కేసీఆర్‌ అని చెబుతున్నాయని ప్రజలు గొప్పగా ఆలోచన చేసి మంథనిలో బీఆర్‌ఎస్‌ పార్టీజెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page