జనత న్యూస్, హైదరాబాద్: అయోధ్య రామ మందిర నిర్మాణంలో అనేక విశేషాలున్నాయి. ఆలయ నిర్మాణంలో ఎక్కడా..ఇనుము, స్టీలు,ఉక్కు,సిమెంట్ ను ఉపయోగించకపోవడం విశేషం. మందిరం కోసం మొత్తం నాపరాయి, పటిష్టమైన రాతినే ఉపయోగించారు. సాధారణంగా ఉక్కును వాడడం వల్ల ఈ కట్టడం నాణ్యత వంద సంవత్సరాలకు మించి ఉండదు. అలాగే కట్టడాలకు సిమెంట్ ను వాడితే..వాటిలో పగుళ్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల రామ మందిర నిర్మాణంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రస్ట్ నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు.
టెంపుల్ కన్స్స్ట్రక్చన్ లో ఎక్కడా ఉక్కు,ఇనుము వంటి మెటిరియల్ ను వాడలేదు. దేవాలయం మొత్తం రాతి కట్టడమే. రాళ్లనే వరుస క్రమంలో కూర్చి టెంపుల్ ను నిర్మించారు. ఆలయానికి ముందు భాగంలో మొత్తం 24 మెట్లను ఏర్పాటు చేశారు. అనంతరం రాములొరు కొలువుదీరే ఏర్పాట్లు చేశారు. రాముల వారికి ఎదురుగా వీర భక్త హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక సూర్యుడి కిరణాలు ఉదయం పూట నేరుగా దేవాలయంలోని రామచంద్రుల వారి పాదాలను తాగేలా ఏర్పాట్లు చేశారు. అలాగే చంద్ర,సూర్య కాలమాణాలను పరిగణలోకి తీసుకొని సూర్యుడి కిరణాలు శ్రీరామ నవమి రోజున ఆయన నుదుడిపై పడేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం దేవాలయం పూర్తి స్థాయిలో అందుబాటు లోకి వచ్చిన తర్వాత బేరింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ ఆలయం ప్రారంభం కాగానే రేపటి నుంచి భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు