జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ బి. గోపి
కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి) భారత ఎన్నికల సంఘం శాసన సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఏర్పాటు చేసిన క్రమంలో జిల్లాలో పబ్లిక్ ప్రదేశాలలో బ్యానర్లు, వాల్ రైటింగ్ లు లేకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాః బి. గోపి పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిపి తో కలిసి ఆర్వోలు మరియు ఇతర ఎన్నికల నోడల్ అధికారుకు ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కడ కూడా బ్యానర్లు గాని, వాల్ రైటింగ్ లు గాని లేకుండా ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని, ఇప్పటికి తొలగించకుండా ఉన్నట్లు దృష్టికి వచ్చినట్లయితే పంచాయితి సెక్రటరీలు, మున్సిపల్ అధికారులపై ఎన్నికల ప్రవర్తన నియావళి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్ 12 బి కొరకు అవసరమైన శాఖలన్నింటిని వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. సెక్టరోల్ అధికారులకు ఎన్నికల సామాగ్రిపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
ఎన్నికల విధుల కొరకు అన్నిశాఖలలోని ఒప్పంద ఉద్యోగులు, పంచాయితి సెక్రటరీల వివరాలను పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని 50శాతం పొలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని, మిగిలిన పోలింగ్ కేంద్రాలలో సిసి టివి, వీడియో రికార్డింగ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యూత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను ఆర్వోలు ప్రత్యక్షంగా పరిశీలించాలని, సెక్టోరల్ అధికారులు కూడా పరిశీలించి నివేదికలను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
ఎన్నికల కొరకు జిల్లాకు వచ్చే జనరల్ అబ్జర్వర్ లు, వ్యయ పరిశీలకులు మరియు పోలీస్ పరిశీలకుల కొరకు కావలసిన ఏర్పాట్లను ముందుస్తుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గం వారిగా రూట్ మ్యాప్ లను సిద్దం చేసుకోవాలని, ఎన్నికల కొరకు అవసరమయ్యే వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా వికలాంగుల కొరకు 2 వీల్ చైర్లు మరియు ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగరాదని, వారిపై ఎఫ్.ఐ.ఆర్. ను నమోద చేయాలని సూచించారు. 1950 కాల్ సెంటర్, సువిధ యాప్ లలో వచ్చే సమస్యలను గురించి ప్రతిరోజు రిజీష్టర్లలలో నమోదు చేయాలని సూచించారు.
సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ, అనుమతి పొందిన వాహనాల ద్వారానే
క్యాంపేయిన్ నిర్వహించేలా చూడాలని, ఎన్నికల ప్రవర్తన నియావళి పై అవగాహన కల్పించాలని, నామినేషన్ ను వీడియో రికార్డింగ్ చేయాలని, బారికేడ్లను ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డిఓలు కె. మహేశ్వర్, రాజు, ఎసిపి విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్లు, ఇతర అధికారులు పాల్గోన్నారు.