Wednesday, September 18, 2024

అక్కడ ఉరిశిక్ష ఈజీ..

మరి ఇండియాలో..
ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ గురించి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అనేక సందర్భాల్లో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఏది చేసినా సంఛలనమే. కాని ఆ దేశంలో లైట్‌గా తీసుకుంటారట. జూలైలో చైనా సరిహద్దుల్లో భారీ వరదలకు కారకులంటూ 30 మందికి మరణ శిక్ష విధించినట్లు అక్కడి చోసన్‌ టీవీ ఛానల్‌ వెల్లడిరచింది. గత సంవత్సరంలో ఈ దేశంలో వివిధ సందర్భాల్లో వంద మందికి మరణ శిక్షలు అమలు చేశారని అక్కడి వార్త సంస్థ పేర్కొనడం విశేషం. ఇతర అనేక సందర్భాల్లో కిమ్‌ నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంటుంది.

కాగా..ఇండియాలో శిక్షలు కఠినంగా లేవనే విమర్శలున్నాయి. బెంగాల్‌లోని కోల్‌కత్తాలో డాక్టర్‌ హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా భారీ ఆందోళనలకు దారి తీసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా శిక్షలు కఠినంగా విధించాలనే డిమాండ్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ‘అపరాజిత విమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ బిల్లు’ను ఏక గ్రీవంగా ఆమోదించింది. ఇందులో అత్యాచారం చేసిన దోషికి ఉరి శిక్ష విధించేలా చట్టం చేసింది ఇక్కడి ప్రభుత్వం. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇలాంటి చట్టాన్ని పార్లమెంటులో తీసుక రావాలనే డిమాండ్‌ కూడా ఉంది. ఇతర నేరాలకు కూడా కఠిన శిక్షలు విధిస్తే, నేరాల సంఖ్య తగ్గుతుందని, అయితే విచారణ కూడా పక్ష పాతం లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండాలనే అభిప్రాయం భారత్‌లోనూ వ్యక్తం చేస్తున్నారు పలువురు మేథావులు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page