విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఓ చెట్టు నుండి నీరు ధారాళంగా బయటకు వస్తుంది. దీనిని చూసిన అటవీ శాఖ అధికారులు షాక్ అయ్యారు. అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటనను స్థానిక అటవీ అధికారులు గుర్తించారు. ఇటీవల టేకు చెట్ల వివాదంపై అటవీ ప్రాంతంలో అధికారులు చెట్ల పరిశీలనకు వెళ్లిన అధికారులకు ఈ అద్భుతం కనిపించింది. ఈ నీరు నల్ల మద్ది చెట్టు నుంచి వస్తోంది. ఇక్కడ వేల చెట్లు ఉన్నాయి.వీటిలో ఒక చెట్టును కత్తితో నరకగానే ఒక్కసారిగా చెట్టు నుండి జలాధార బయటకు వచ్చింది. దీంతో అధికారులు శాఖ అయ్యారు. చెట్టు నుంచి సుమారు 10 నుంచి 15 లీటర్ల వరకు నీరు రావడం గమనించామని అధికారులు తెలిపారు.
చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు.. అటవీ అధికారుల షాక్
- Advertisment -