వరంగల్, జనతా న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు నియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులు ఉదయాన్నే ఓటు వేసి వ్యవసాయ పనులకు పోవచ్చు అని ఆలోచనతో గ్రామీణ ప్రాంతాలలో ఓటు వినియోగానికి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకున్నారు. ఉదయం ఏడు నుండి ప్రారంభమైన పోలింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఉదయం 8 గంటల వరకు, హనుమకొండ వరంగల్ పశ్చిమ (7ఏడు శాతం), పరకాల( 6.74శాతం ) ఉదయం 9 నుండి , 11 గంటల వరకు 21.16 శాతం, అయినట్లు చెప్పవచ్చు. ఇందులో పరకాల 26.25బ వరంగల్ వెస్ట్ 17.23 నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ సరళి పరిశీలిస్తే మొత్తం 35.29 శాతం. ఇందులో పరకాల నియోజకవర్గంలో 41.56 శాతం, హనుమకొండ( వరంగల్ పశ్చిమ) 30.44% నమోదయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.హనుమకొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకూ 49 శాతం పోలింగ్ అయినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నారు.
ఇందులోపరకాల నియోజకవర్గం- 58.23 శాతం, హనుమకొండ( వరంగల్ వెస్ట్ )నియోజకవర్గం:41.87 నమోదయింది. నాలుగున్నర వరకు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు జిల్లా లో 49 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఇంక గంటన్నర మాత్రమే సమయం ఉండడంతో ఓటు వేయని వారు త్వ