బెజ్జంకి, జనతా న్యూస్: సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ప్రమోదరావు సరిత దంపతుల కుమార్తె సుహాని రావు ‘మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ ’ యూకే టైటిల్ గెలుచుకున్నారు. ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి దక్షిణాసియా వాసిగా ఆమె నిలిచిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు అమెరికాలో జరిగే ‘గెలాక్సీ ఇంటర్నేషనల్’ పోటీల్లో యూకే తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా తోటపల్లి గ్రామ ప్రజలతో పాటు బెజ్జంకి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
