కరీంనగర్,జనత న్యూస్: పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూను నివారించవచ్చునని జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ సుజాత సూచించారు.గురువారం అర్బన్ హెల్త్ సెంటర్ బీఆర్ఆర్ కాలనీ వద్ద డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలిని డాక్టర్ సుజాత ప్రారంభించారు.డ్రా డే ప్రైడే వంటి కార్యక్రమాలతో నిల్వ నీటిని తొలగించి దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సుజాత సూచించారు.ఈ కార్యక్రమంలో డా. జువెరియా, డీప్యూటీ డి.యం.&హెచ్.ఓ.డా.బి.రాజ గోపాల్ రావు,జిల్లా మలేరియా అధికారి,డా.సాజిధా, డీ.ఐ.ఓ.సి.హెచ్.రంగా రెడ్డి,డెమో,కైక,హెచ్ఈ. నాగేశ్వర్,సి.హెచ్.ఓ.యం.రామనాధం,ఏ.మల్లయ్య సబ్ యూనిట్ ఆఫీసర్లు లింగయ్య,సంతోష్,లక్ష్మి సూపర్వైజర్లు,బీఆర్ఆర్ కాలనీ సిబ్బంది పాల్గొన్నారు.
నిల్వ నీటిని తొలగించాలి..
- Advertisment -