జనత న్యూస్ బెజ్జంకి : మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ వాడ వాడ తిరుగుతూ గ్రామంలోని సమస్యలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే రాష్ట్రానికి సరిపడా నిధులు రావడంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలిపారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన నిజాం రజాకారు పాలనను తలపించిందని ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, ఇక మన కాంగ్రెస్ పాలనలో అలాంటి కష్టాలు ఉండవని అన్నారు. అలాగే 10 సంవత్సరాల కేంద్రంలో ఉన్న మోడీ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు రావలసిన నిధులు ఇవ్వలేదని మోడీ పాలన సూటు బూటు పాలనా అని, ఇక అలాంటి కార్పొరేట్ పాలనకు చరమగీతం పాడాలని అది ఓటు హక్కు ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలుపుతూ, మన సామాన్య నిరుపేదల ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అనంతరం గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ తో కలిసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హనుమండ్ల సందీప్ రెడ్డి కుటుంబాన్ని మరియు గూడెం గ్రామంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గూడెల్లి మల్లయ్య ను పరమర్శించారు. అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో బెజ్జంకి తాజా మాజీ సర్పంచ్ ద్యావనపెల్లి మంజుల శ్రీనివాస్ ను మరియు వివిధ పార్టీలకు చెందిన అనేక మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు పులి కృష్ణ, ఆర్.టి.ఐ చైర్మన్ రాసూరి మల్లికార్జున్, మహంకాళి ప్రవీణ్ కుమార్, మంద శేఖర్ గౌడ్, పులి సంతోష్ గౌడ్, జెల్ల ప్రభాకర్ యాదవ్, ఇష్కిల ఐలయ్య, ఎండి సాదిక్, పులి రమేష్ గౌడ్, సంగెం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- Advertisment -