ఇప్పుడు ప్రపంచం నుండి ప్రశంసలు..
జనత న్యూస్ :
ఒకప్పుడు రూపం చూసి గ్రామస్తుల నుండి దూషణలు ఎదుర్కొంది ఆ కుటుంబం. ఇప్పుడు ఆ గ్రామమే కాదు, యావత్ ప్రపంచమే ఆ బిడ్డపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన జీవన్ జీ యాదగిరి, ధనలక్ష్మి లకు 2003లో కూతురు జన్మించింది. పుట్టినప్పుడు రూపం సరిగా లేదని బంధువులు, గ్రామస్తులు దూషించారట. తండ్రి ట్రక్ క్లీనర్‌గా పని చేస్తూ, అర ఎకరం పొలంలో సాగు చేసుకుంటూ..కూతురైన జివాంజి దీప్తికి ప్రోత్సాహాన్ని అందించారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొన్న దీప్తి జీవన్‌జీ..ప్రస్తుతం ప్రాన్స్ దేశంలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ నుండి పాల్గొని రజత పథకం గెలుచుకుని..ప్రపంచ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. మహిళల 400 మీటర్ల టీ 20 రేసులో రజన పథకాన్ని అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా దీప్తిని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం సహా మంత్రులు అభినందించారు. క్రీడాకారిని దీప్తి..యావత్ ప్రపంచానికి ఆదర్శనంగా నిలుస్తున్నారు. పేదరికం, రూపం..తన లక్ష్యం ముందు ఓడిపోయిందని నిరూపించింది. హాట్సప్ దీప్తి జీవన్ జీ !
ఒకప్పుడు గ్రామస్తుల నుండి దూషణలు..

- Advertisment -