ముగ్గురికి తీవ్ర గాయాలు.
జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం తోటపల్లి శివారులో రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి 10:30 ని లకు సిద్దిపేట నుండి కరీంనగర్ వైపుగా వెళుతున్న డిస్కవరీ బైకును వెనుక నుండి TS 07UJ1278 నెంబర్ గల లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామానికి చెందిన సంపత్, ధర్మేందర్, సంపత్ అనే ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు వారిని కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అలాగే లారీ డ్రైవర్ కు కూడా గాయాలైనట్లు కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెజ్జంకి ఎస్సై జి. కృష్ణారెడ్డి తెలిపారు.