- బిఆర్ఎస్ సర్కార్ తోనే అభివృద్ధి సంక్షేమ ఫలాలు
- మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని, జనతా న్యూస్: ఆరు అబద్దాల పథకాలతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ను నమ్మితే కర్ణాటక తరహాలోనే గోసపడ్తామని మున్సిపల్ చైర్ ఫర్సన్ ఫుట్ట శైలజ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు ఓటు వేసి ఆశీర్వదించాలని మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు అంబేద్కర్‌నగర్, మర్రివాడ ఏరియాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలకు బొట్టు పెట్టి మంథని అభివృద్ది, పుట్ట మదూకర్ చేసిన సేవలను ఆమె వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక్కరికి సాయం చేయని కాంగ్రెస్‌ని నమ్మితే మళ్లా ఐదేండ్లు ఇదే పరిస్థితి ఉంటుందని తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు ఎమ్మెల్యేగాఈనాడు జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మదూకర్ అనేక అభివృధ్ది పనులు, సంక్షేమ ఫలాలు అందించారని, అలాగే పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించారనిఇంటి నుంచి బయటకు వస్తే అభివృధ్ది కనిపిస్తుందని.
మంథని అభివృధ్దితో పాటు పట్టణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ప్రజల కష్టాలు కన్నీళ్లు ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే మోసపోక తప్పదన్నారు. అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృధ్దిని గుర్తు చేసుకోవాలని, 40ఏండ్లలో జరుగని అభివృధ్దిని తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ సర్కార్‌లో చేసి చూపించామని నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పుట్ట మదూకర్ కి అవకాశం కల్పిస్తే మీ కుటుంబసభ్యుడిలా అండగా నిలిచారని, మీ బిడ్డల భవిష్యత్ కోసం ఆరాటపడే నాయకుడు పుట్ట మధూకర్ అని అన్నారు ఆనాడు గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో అంబేద్కర్‌నగర్ ఒక మురికికూపంలా ఉండేదని, వాళ్లను అంటరానీవాళ్లలా చూసేవారని, కానీ ఈనాడు అంబేద్కర్‌నగర్ రూపరేఖలుమార్చి ఆదర్శంగా నిలిపిన చరిత్ర మాదేనని ఆమె అన్నారు. ఇంత అభివృధ్ది, సేవలు చేస్తుంటే కాంగ్రెస్సోళ్లు ఓర్వలేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, వాళ్ల అబద్దాల మాటలకు మోసపోవద్దన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం వచ్చే నాయకులు కాంగ్రెస్సోళ్లని, అలాంటి వాళ్లు ఐదేండ్లకోసారి మాత్రమే కన్పిస్తారని ఆమె విమర్శించారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుంటున్నామని అన్నారు. మంథని పట్టణ ప్రజలు గొప్పగా ఆలోచన చేయాలని అభివృధ్ది చేసే నాయకుడికి అండగా నిలువాలని, కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధూకర్ ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.