Saturday, March 14, 2026

కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేపై గవర్నర్ సీరియస్..

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై గవర్నర్ తమిళ సై సీరియస్ అయ్యారు. సమాజంలో కొందరు మాట్లాడేటప్పుడు ఇతరులను ప్రభావితం చేయకూడదని, అలాంటి వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు విలువ గురించి చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ గత నవంబర్ లో జరిగిన ఎన్నికల ప్రచారం పై మాట్లడారు. ఈ ఎన్నికల్లు హుజూరాబాద్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. ఈసారి తనకు అవకాశం కల్పించాలని, లేకుంటే కుటుంబ మొత్తం కలిసి ఆత్మ హత్య చేసుకుంటా.. అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ వ్యాఖ్యల ఫలితంగానే పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందారన్న ప్రచారం కూడా సాగింది.

అయితే గవర్నర్ పాడి కౌశిక్ రెడ్డి ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలా వ్యాఖ్యలు చేసేవారికి ప్రభావితం కావొద్దన్నారు. సమాజంలో ఓటువేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలింగ్ జరిగే రోజు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, దీనిని సెలవుదినంగా భావించి సరదాగా ఉండోద్దని సూచించారు. సాధారణ పౌరుడిని ఓటరుగా చేసే ఇందులో అందరూ పాల్గొనాలని ఆమె సూచించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page