ఏపీలో సర్పంచ్ లు ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లుగప్పి కొందరు సర్పంచ్ లు అసెంబ్లీని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కొందరు సర్పంచ్ లకు గాయాలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని, ఉపాధి హామీ నిధులను చట్టం ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం, పంచాయతీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో ముందుగానే పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కొందరు అసెంబ్లీ వరకు రావడం ఉద్రిక్తంగా మారింది.
సర్పంచుల ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
- Advertisment -