Saturday, July 5, 2025

కొలువుదీరిన అసెంబ్లీ.. మంత్రులు వారి శాఖలు ఇవే..

హైదరాబాద్‌, జనతా న్యూస్:తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ఆయన స్పీకర్‌ను కలిశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణం చేశారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసదుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్‌ నేత అయిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.

మంత్రులు` శాఖలు

  • భట్టివిక్రమార్క- ఆర్థిక, విద్యుత్‌ శాఖ
    ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాలు
    శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
    దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
    తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ
    జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ
    పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ
    పొన్నం ప్రభాకర్‌- రవాణా, బీసీ సంక్షేమం
    సీతక్క- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌
    కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page