Tuesday, September 9, 2025

ఆ తహసిల్డార్​ పై ఆరోపణలు మస్తు!

  •  లంచం డబ్బులతో ఎసిబికి చిక్కాక వెలుగులోకి
  •  అవినీతి సొమ్ములో మీ సేవ సెంటర్ కు లింక్
  •  అక్కడి నుండే అవినీతి ట్రాన్సాక్షన్
  •  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రధాన అనుచరుని దగ్గరా డబ్బులు వసూల్
  •  డబ్బుల సంపాదనే లక్ష్యంగా విధులు
  •  ఆఫీసర్ల పై ఒత్తిడి
  •  ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడ్డ ఆఫీసర్లు
  •  ఏసిబి కి చిక్కాక సంతోషంలో కార్యాలయ సిబ్బంది
  •  ఎమ్మార్వో మాధవి పై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు
  •  ఆఫీసులో సిబ్బంది తీరుపై ఇంకా ఏసీబీ ఆరా !
  •  తప్పు చేసిన ఆఫీసర్ల వెన్నులోవణుకు –

హనుమకొండ, జనతా ప్రతినిధి :  తహసిల్డార్​ మాధవి అవినీతి పాపాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. 10 నెలల డ్యూటీలో ఆమె చేసిన అవినీతి పనులు, ఆరోపణలు శాంతాడంతగా ఉండగా బాధితుల సైతం ముందుకు వస్తూ అవినీతి ఆరోపణలు వ్యక్తపరుస్తున్నారు. నవ్వుతూ పలకరించే ఈ మేడం కమర్షియల్ గా కొంత కరప్షన్ ఆఫీసర్.. ఇది బహిరంగంగా మీడియా ముందే ఏసీబీ డిఎస్పి చెప్పగా ఆయన చెప్పినట్లే ఆఫీసర్ చేసిన అవినీతి పనులు అన్నీ ఇన్ని కావు.

ఆఫీసులో ఆఫీసర్ల పై ఒత్తిడి – పెత్తనం :

ఆఫీసు సిబ్బంది మొదలుకొని ఆమెకింది ఆఫీసర్లను సైతం ఇబ్బందులు పెట్టిన తీరు విస్మయానికి గురిచేస్తుంది. ఆఫీస్ కి వచ్చే కొన్ని రకాల సర్టిఫికెట్ల నుండి డబ్బులు తీసుకోవాలని ఆఫీసర్లను ఒత్తిడి తెచ్చేదట అలా ఇవ్వని వాటికి సంతకాలు పెట్టకుండా తరచూ ఇబ్బందులకు గురి చేస్తూ పెత్తనం సాగించేదట.. అంతేకాదండోయ్ దురుసుగా కూడా మాట్లాడేదట. అటు విధులు, ఇటు ఇబ్బంది పడలేక పలుమార్లు కొంతమంది ఆఫీసర్లు పలువురు ప్రజా ప్రతినిధులకు చెప్పుకొని ఈ ఆఫీసర్ను ఇక్కడ నుండి పంపియండి అన్న తీరును చూస్తుంటే ఆఫీసర్ మంచితనం ఏంటో ఇట్టే అర్థం అయిపోతుంది.

మీసేవ సెంటర్ తో అవినీతి లింకు :

కమలాపూర్ లోని ఓ మీసేవ సెంటర్ యజమానితో అవినీతి లింకు పెట్టుకొని అక్కడి నుండి నిత్యం వసుళ్ళకు పాల్పడేదన్న ఆరోపణలు లేకపోలేదు. భూ రిజిస్ట్రేషన్ కోసం మీ సేవ సెంటర్ కు వెళ్తే అక్కడ వారు మీసేవ సెంటర్ ఫీజు తో పాటు చలాణ్ డబ్బులు తీసుకోవాలి కానీ అదనంగా ఆఫీసర్ పని చేయడానికి వేల రూపాయల డబ్బులను ఇక్కడే వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ పని అంతా సాఫీగా సాగకా ఏ రోజు లెక్కలు ఆ రోజు ఆఫీసర్ కు అప్పజెప్పాల్సిందే. ఇలా నిత్యం రిజిస్ట్రేషన్ తంతు జరిగేది.

డబ్బులు ఎట్లా దండుకునేదంటే :

ఆఫీసుకు వచ్చిన వాళ్లను తనదైన శైలిలో ఎమ్మార్వో మాధవి డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్న సందర్భాలు కోకోల్లలు. స్లాట్ బుక్ చేశాక కుటుంబ సమేతంగా రిజిస్ట్రేషన్ కు వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడి డబ్బులు సమర్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఎట్లా అంటారా మీది భూ సమస్య ఉంది.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కుదరదు.. లేదంటే సర్వర్ సమస్య ఉంది కాసేపు ఆగండి.. ఇవాళ మీది రిజిస్ట్రేషన్ కాదు దానిపై ఎంక్వయిరీ చేయాలి అన్న పలు రకాల మెలికలతో మేడం రిజిస్ట్రేషన్ కు మోకాలు అడ్డు పెట్టడంతో ఫ్యామిలీతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఆ బాధితులు మళ్లీ రాలేక మరోసారి స్లాట్ బుక్ చేయలేక మేడం ఎట్లా నైనా పనిచేయాలని ఒక్క మాట చెబితే చాలు.. అన్ని తానై చూసుకుంటుంది. కాసేపు వెయిట్ చేయండి పరిశీలిస్తామంటూ తీయటీ కబురు చెప్పి కాస్త ఖర్చవుతుంది.. అని బుట్టలోకి దింపి ఆ ఏరియా భూ విలువ ..ఎకరాలను బట్టి వేల రూపాయలను ఇట్టే వసూల్ చేస్తుంది.

అవినీతి లో ధరణి ఆపరేటర్ హస్తం :

ఆఫీసర్ అవినీతిలో ఆపరేటర్ ది కూడా ప్రధాన హస్తమే.. మీసేవ సెంటర్, ఎమ్మార్వో, ఆపరే టర్ ఈ ముగ్గురు కలిసి నిత్యం భూ రిజిస్ట్రేషన్ల విషయంలో వేల రూపాయలు దండుకున్న ఆరోపణలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు ముట్టాకే ఆపరేటర్ పని చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయంటే వీళ్ల ఓ కమిట్మెంట్ తో అక్రమాలకు తెర లేపారన్న ఆరోపణలు లేకపోలేదు.

అంత డబ్బులు ఇయ్యలేకనే రైతు ఏసీబీకి పట్టించిండు :

విరాసత్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఎమ్మార్వో మాధవి అడగడంతో అంత ఇచ్చుకోలేని కన్నూర్ గ్రామ రైతు గోపాల్ ఏసీబీకి పట్టించాడు. మూడు ఎకరాల భూమికి 30 వేల రూపాయల లంచం అడగడంతో స్తోమత లేని రైతు ఏసీబీ ని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. రైతు చేసిన మంచి పనిని తోటి రైతులే మెచ్చుకోగా మేడంకు మంచి శాస్త్రీ జరిగిందని ఆఫీసులోని కొంతమంది ఆఫీసర్లు లోలోపల నవ్వుకుంటూ బయటికి మాత్రమే బాధను వ్యక్తం చేస్తుండ్రు.

ఇంకా కొంత మంది పనితీరుపై ఏసీబీ ఆరా !

ఆఫీసులో పని చేసిన ఇంకా కొంతమంది పని తీరుపై ఏసీబీ ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వారు విధులు చేసే సమయంలో ఎట్లా ఉంటున్నరు ఏం చేస్తున్నరు అన్న కొణం లో సమాచారం క్లుప్తంగా రాబడుతున్నట్లు సమాచారం. కాగా ఏసీబీ ఆఫీసర్లు ఇంకా డీటెయిల్స్ సేకరిస్తున్నారన్న సమాచారం తెలియడంతో కొంతమంది ఆఫీసర్ల వెన్నులో వణుకు పుడుతోంది. ఎమ్మార్వో మాధవి పట్టుబడి వారం రోజులు గడుస్తున్న అవినీతి ఆరోపణలు మండల వ్యాప్తంగా మస్తు వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page