ప్రముఖ యూటూబర్ హర్షసాయిపై ఓ యువతి పెట్టిన కేసుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదై రిమాండ్‌కు తరలించిన తరువాత నేడు విచారణ పేరుతో పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేమస్ యూటూబర్ హర్షసాయిపై ఇదే హైదరాబాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఆధారాలు సమర్పించాలని సదరు ఫిర్యాదు చేసిన మహిళకు నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. తనను పెల్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, రూ.2 కోట్లు తీసుకున్నాడని హర్షసాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై చేసిన ఫిర్యాదుపై ఆమె పోలీసులకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా..దీనిపై హర్షసాయి తరుపున న్యాయవాది స్పందించారు. తన క్లైయింట్ హర్షసాయి వద్ద డబ్బులు వసూలు చేసేందుకే ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తుందని ఆరోపిస్తున్నాడు లాయర్. సామాజిక సేవ కార్యకర్తగా, ఇటీవల పాన్ ఇండియా తరహాలో సినిమా తీస్తున్న హర్షసాయిపై తాజాగా యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం చర్చకు దారి తీసింది.
ఆ మహిళ.. హర్షసాయిపై చేసిన నేరారోపన రుజువు చేస్తుందా..?

- Advertisment -