మీడియా ఎదుట బాధితుడి గోడు
కరీంనగర్-జనత న్యూస్
తనకు ఆ ఎస్‌ఐ నుండి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. కరీంనగర్ ప్రెస్ భవన్‌లో రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనుకయ్య, అతని భార్య అనిత మీడియా ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. చేయని నేరానికి తనను పోలీస్ స్టేషన్‌లో పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారని కనుకయ్య తెలిపాడు. జూన్ 11న రాత్రి తన ఇంటి నుండి రామడుగు పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుండి కరీంనగర్‌కు తీసుకెళ్లి చిత్రవధకు గురి చేసి ఇంటికి పంపించారని తెలిపాడు. ఆ తరువాత 26వ తేదీన మరోసారి రామడుగు పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్ చేశారని..తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని చెప్పాడు. కూతాడి కనుకయ్యను చిత్రవధకు గురి చేసిన ఎస్‌ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేశ్ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
ఆ ఎస్‌ఐ నుండి ప్రాణహాని ఉంది
- Advertisment -