Friday, September 12, 2025

సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ సడలింపులు ఇవ్వాలి

ఎస్టీయూ బెజ్జంకి మండల శాఖ

జనతా న్యూస్ బెజ్జంకి : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష  టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ )లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపులు ఇవ్వాలని ఎస్ టీయూ బెజ్జంకి మండల శాఖ ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ శనివారం పత్రికా ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. 2010 సంవత్సరం కు ముందు సర్వీసులోకి వచ్చిన ఉపాధ్యాయులకు( టెట్ ) నుంచి సడలింపు ఇవ్వాలని, చాలా సంవత్సరాలు పోటీ పరీక్షలకు దూరంగా ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుందని, ఏ పరీక్ష రాయని కాంట్రాక్ట్ లెక్చరర్ లను డైరెక్ట్ గా జూనియర్ లెక్చరర్ గా ప్రభుత్వం నియమించిందని, ఎన్నో సంవత్సరాల నుండి ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న ఏ ప్రమోషన్ లేకుండా ఉన్న మమ్మల్ని నిరుత్సాహానికి గురి చేయడం బాధాకరమని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులను సమీక్షించి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల శాఖ అధ్యక్షులు నా రోజు శంకరాచారి, ప్రధాన కార్యదర్శి రామంచ రవీందర్, ఉపాధ్యాయులు ఎం రమేష్, వి సతీష్ కుమార్, పి రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page