Terrorist: భారత్ లోని పఠాన్ కోట్ ఉగ్రవాది దాడుల్లో కీలక సూత్రధారి, ఉగ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడు. బుధవారం పాకిస్తాన్ లోని సియోల్ కోట్ లో కొందరు గుగ్తు తెలియని వ్యక్తులు అతనిని చుట్టుముట్టు తుపాకీతో కాల్పులు జరిపారు. దాదాపు ఎనిమిదేళ్ల కిందట పఠాన్ కోట్ పై నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అనే సంస్థకు చెందిన లతీఫ్ ను 1994లోనే భారత్ అరెస్టు చేసింది. ఆ తరువాత కొన్నాళ్లపాటు జైలు జీవితం గడిపాడు. 2010ల వాఘా సరిహద్దు ద్వారా అతడిని పాకిస్తాన్ కు పంపించారు. 1996లో ఇండియన్ ఎయిర్ లైన్స్ హైజాకింగ్ కు పాల్పడ్డవారిలో నిందితుడిగా ఉన్నాడు. ఆ తరువాత 2010లో పాకిస్తాన్ కు వెళ్లి పాకిస్తాన్ కు వెళ్లి ఉగ్రవాద సంస్థలో కొనసాగాడు. బుధవారం పాకిస్తాన్ లోని సియోల్ కోటలో ఓ ప్రదేశంలో అతనిని కాల్చి చంపారు. అయితే నిందితులు ఎవరనేది దర్యాప్తు చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
Terrorist: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాది హతం
- Advertisment -