‘జనత’ అలెర్ట్
బంగాళా ఖాతంలో మధ్య భాగంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడన ద్రోణి ఏపీ తీరం నుండి వెళ్తూ.. 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశాలున్నాయని..దీనివల్ల ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురువ వచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల 19 సెంటీ మీటర్లకు మించి వర్షపాతం నమోదు కావచ్చు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు..ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించారు. మిగతా కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్క డక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. హైదరాబాద్,సమీప జిల్లాల్లో భారీ వర్షలు కురుస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Advertisment -