హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఏడు జిల్లాల్లో, సోమవారం మూడు జిల్లాలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు వాతావరణ ఎల్లో అల్ట్ ను కూడా జారీ చేసింది. ఆదివారం కుమరం భీం, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సోమవారం అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే వర్షాలు ఉంటాయాని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వెదర్ అలర్ట్: ఈ జిల్లాల్లో వర్షాలు
- Advertisment -