రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. 26, 27 తేదీల్లో కొన్ని జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

- Advertisment -