Telangana TDP :తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటోంది. శనివారం ములాఖత్ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఒానేశ్వర్ కు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రపై ఫోకస్ పెట్టామని, తెలంగాణలో దృష్టి పెట్టలేమని చంద్రబాబు అన్నారు. అయితే తెలంగాణలో బరిలో నిలవాలని తాము అనుకుంటున్నామని, పోటీకి అనుమతి ఇవ్వాలని జ్ఒానేశ్వర చంద్రబాబును కోరగా.. తెలంగాణలో పోటీకి దిగితే యుద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకందరికి తెలిసే ఉంటుంది. వచ్చే మే నెలలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ పోరాడి గెలవాల్సిన అవసరం ఉంది. ఏపీలో విజయం సాధిస్తే ఆ తరువాత తెలంగాణలో పార్టీ బలం పుంజుకునే అవకాశాలు ఉంటాయి.. అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
కొన్ని రోజులుగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని టీడీపీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముదిరాజ్ వర్గానికి చెందిన ఆయనను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముదిరాజ్ లను తమ వైపు తిప్పుకున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో కాసాని, ఆయన అనుచరులు ఆలోచలనో పడ్డారని తెలుస్తోంది.