Thursday, September 19, 2024

తెలంగాణ ప్రజా పాలన కాదు..

తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి
తెలంగాణ విమోచనం నిర్వహిస్తే భాగస్వాములమౌతాం
కాంగ్రెస్‌ దుర్మార్గాలకు పరాకాష్ట
కేంద్ర మంత్రి బండి సంజయ్‌
హైదరాబాద్‌ :
ఈ నెల 17న తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండని ఎద్దేవ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. తెలంగాణ విమోచన వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ తోపాటు పలువురు నేతలతో కలిసి సంజయ్‌ తిలకించారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్వవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్‌ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని మాట ఇచ్చిన తరువాత వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోదీ ఆదేశాలు, అమిత్‌ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాంస్క్రుతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను 75 ఏళ్లపాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని, ఎన్నో ఏళ్లపాటు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని యువకులు జాతీయ జెండాలు పట్టుకుని ఉద్యమించారన్నారు.
నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోరాటాలు.. హిందూ మహాసభ, ఆర్య సమాజ్‌ పోరాటాలను గుర్తుచేసేందుకు, రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన 1500 మందిని బలిదానం చేసుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని, వారి బలిదానాలతో తీవ్ర భావోగ్వేదానికి గురైన సుష్మాస్వరాజ్‌ ఎవ్వరూ చనిపోవద్దని పేర్కొంటూ తెలంగాణ బిల్లును పార్లమెంట్‌ లో ఆమోదింపజేసి స్వరాష్ట్ర ఏర్పాటుకు క్రుషి చేశారని గుర్తు చేశారు. ఒకవైపు రాహుల్‌ గాంధీ అమెరికాలో భారతదేశాన్ని కించపరుస్తున్నడని, ఇక్కడ ఒవైసీకి వత్తాసు పలికి తెలంగాణను సీఎం కించపరుస్తున్నడని ఆరోపించారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో యువకులతో క్రికెట్‌ ఆడి ఉత్సాహ పర్చారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page