కరీంనగర్, జనతా న్యూస్: నామినేషన్ల స్క్రూటీలో భాగంగా ఈటల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ తిరస్కరించారు. సరైన పత్రాలు లేనందున ఈమె నామినేషన్ రిజెక్ట్ చేశారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 307 పత్రాలను దాఖలు చేయగా.. ఇందులో 46 తిరస్కరణకు గురయ్యాయి. 261ను ఆమోదించారు. కరీంనగర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గంలో 89 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో 14 తిరస్కరణకు గురయ్యాయి. 75 మందివి ఆమోదించారు. అన్ని నియోజకవర్గాల్లో కంటే హూజూరాబాద్ లో ఎక్కువగా 8 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహకరణకుగడువు ఉంది. ఆ లోపు ఎంత మంది ఉపసంహరించుకుంటారనేది ఆసక్తిగా ఉంది.
Telangana Nomination : ఈటల రాజేందర్ సతీమణి నామినేషన్ తిరస్కరణ
- Advertisment -