- ఏళ్ళ తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ
కరీంనగర్,జనత న్యూస్: తెలంగాణ రైతుల భూములు సాగునీరు లేక ఎడారిగా మారుతుంటే చూడలేక…నీటికోసం పోరాటంలో భాగంగా మహారాష్ట్ర లోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు కోర్టుకు హాజరయ్యారు.బాబ్లీ కేసు విచారణలో మంగళవారం మహారాష్ట్ర లోని బిలోలి సెషన్ కోర్టు కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ , విజయ రమణ రావు, మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కే.ఎస్.రత్నం హాజరయ్యారు.మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు రాకుండా అడ్డుకోవడంతో 2010లో టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు దిగారు.బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో మహారాష్ట్ర పోలీసులకు టిడిపి నాయకులకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో మరాఠి పోలీసులు లాఠీ చార్జి చేయడమే కాకుండా చంద్రబాబు తో సహ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా మహారాష్ట్రలోని బిలోలి కోర్టుకు హాజరైన తమ వాదనను వినిపించారు….
నాడు టీడీపీలో.. నేడు వేర్వేరు పార్టీల్లో…
బాబ్లీకి వ్యతిరేకంగా నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన లో టీడీపీ ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు. ఆనాటి పోరాటంలో ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్,టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా విజయరమణారావు, నాయకులుగా ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ బీఆర్ఎస్ లో ఉండగా విజయరమణ రావు కాంగ్రేస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.నాడు ఒకే పార్టీలో ఉండి ఒకే నినాదం తో ఫైట్ చేసిన ఎమ్మెల్యేలు నేడు వెర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కోర్టు లో కలుసుకుని పాత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.
