తెలంగాణ ఈ ఏపీ సెట్- 2024 ఫలితాలు శనివారం 11 గంటలకు విడుదలయ్యాయి. వీటిని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అవుతుందని తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో ప్రణీత మొదటి ర్యాంకు సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో జ్యోతి రాధిత్య పాలకొండ చెందిన విద్యార్థి మొదటి స్థానంలో నిలిచారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ లో అమ్మాయిలదే హవా కొనసాగింది. ఇంజనీరింగ్ లో అబ్బాయిలు 74.30% క్వాలిఫైడ్ అయ్యారు. అమ్మాయిలు 75.85% క్వాలిఫైడ్ అయ్యారు. మొత్తం 74.98. ఉత్తీర్ణత శాతం సాధించారు. ఫలితాల కోసం https://eapcet.tsche.ac.in/ అనే వెబ్ సైట్ లో చూడండి..
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
- Advertisment -