Telangana Congress : హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శుక్రవారం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 55 మందితో మొదటి జాబితాను అక్టోబర్ 15న విడుదల చేసింది. ఆ తరువాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ పేర్లు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ నివాసంలో పలుమార్లు సమావేశం అయ్యారు. బుధవారం మరోసారి నిర్వహించిన సీఈసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతలు మల్లు భట్టి వక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు.అభ్యర్థులను పూర్తిగా పరిశీలించి 35 నుంచి 40 పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడో జాబితా ఆ తరువాత విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అధికార బీఆర్ పార్టీ 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే శుక్రవారం విడుదల చేసే జాబితాపై పలువురు నేతలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Telangana Congress : నేడు కాంగ్రెస్ రెండో జాబితా…మూడో లిస్ట్ ఉంటుందా?
- Advertisment -