Telangana Congress : హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణలో శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిక ముందే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలోఉత్కంఠ నెలకొంది. రోజురోజుకు అభ్యర్థుల విషయంతో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదివారం ఉదయం 50 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం నుంచి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్నారు. కానీ వీరు పేర్లు లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. తొలిజాబితా ప్రకారం సిట్టింగ్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన సతీమణి పద్మావతికి కూడా కోదాడ టికెట్ కేటాయించారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడడ్ి కొండగల్ నుంచి పోటీ చేస్తున్నారు.
50 మంది అభ్యర్థులు వీరే..
శ్రీహరి రావు (నిర్మల్), గడ్డం వినోద్ (బెల్లంపల్లి (ఎస్సీ) , ప్రేమం సాగర్ రావు (మంచిర్యాల), సుదర్శన్ రెడ్డి (బోధన్), వినయ్ కుమార్ రెడ్డి (ఆర్మూర్), సునీల్ కుమార్ (బాల్కొండ),జీవన్ రెడ్డి, (జగిత్యాల), లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), రాజ్ ఠాకూర్ (రామగుండం), దుద్దిళ్ల శ్రీధర్ బాబు (మంథని), చింతకుంట విజయరమణారావు (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (వేములవాడ), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూర్), మైనంపల్లి రోహిత్ రావు (మెదక్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), ఆగం చంద్రశేఖర్ (జహీరాబాద్), జగ్గారెడ్డి (సంగారెడ్డి), తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్), తోటకూర వజ్రేష్ యాదవ్ (మేడ్చల్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజగిరి), కోలన్ హన్మంత రెడడ్ి (కుత్బుల్లా పూర్), పరమేశ్వర్ రెడ్డి (ఉప్పల్), భీమ్ భరత్ (చేవేళ్ల), టి. రామ్మోహన్ రెడ్డి (పరిగి), గడ్డం ప్రసాద్ కుమార్ (వికారబాద్), గడ్డం ప్రసాద్ కుమార్ (వికారాబాద్), అంజన్ కుమార్ యాదవ్(ముషీరాబాద్), షేక్ అక్బర్ (మలక్ పేట), కోట నీలిమ (సనత్ నగర్), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), ఉఏస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి (కార్వాన్), మొగిలి సునీత (గోషా మహల్), బోయ నగేశ్ (చాంద్రాయణ గుట్ట), రవి రాజు (యాకత్ పుర), రాజేశ్ కుమార్ పులిపాటి (బహదూర్ పుర), సంతోష్ కుమార్ (సికింద్రాబాద్), రేవంత్ రెడ్డి (కొడంగల్), సరితా తిరుపతయ్య (గద్వాల), సంపత్ కుమార్ (అలంపూర్), రాజేశ్ రెడ్డి (నాగర్ కర్నూల్), వంశీ కృష్ణ (అచ్చంపేట), కసిరెడ్డి నారాయణ రెడ్డి (కల్వకుర్తి), కె. శంకరయ్య (షాద్ నగర్), జూపల్లి కృష్ణా రావు (కొల్లాపూర్), కందూరు జయవీర్ (నాగార్జున సాగర్), ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్), పద్మావతి రెడ్డి (కోదాడ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), వేముల వీరేశం (నకిరేకల్), బీర్ల ఐలయ్య (ఆలేరు), సింగాపురం ఇందిర (స్టేషన్ ఘన్ పూర్), దొంతి మాధవ్ రెడ్డి (నర్సంపేట), గండ్ర సత్యనారాయణ (భూపాల పల్లి), సీతక్క (ములుగు), మల్లు భట్టి విక్రమార్క (మధిర), పొదెం వీరయ్య (భద్రాచలం).