Telangana congress : హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఆ పార్టీలోకి తాజాగా మాజీ మంత్రి మోత్కులపల్లి నర్సింహులు చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్చే సమక్షంలో శుక్రవారం ఆయన కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్ రెడ్డి, శాసన మండల మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసారగ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి, దిలీప్ కుమార్, కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తరువాత శుక్రవారం భారీగా చేరికలు సాగాయి.
Telangana congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి కీలక నేతలు
- Advertisment -