హైదరాబాద్, జనత న్యూస్: తెలంగాణ బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2023-24లో సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2024-25 సంవత్సరానికి రూ.2.95 కోట్ల బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతారు. మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తరువాత అసెంబ్లీకి రానున్నారు.
నేడు తెలంగాణ బడ్జెట్.. అంచనా రూ.2.90 లక్షల కోట్లు?
- Advertisment -
