Telangana Bjp:న్యూఢిల్లీ, జనతా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువెడిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులపై ఉత్కంఠ నిన్నటి వరకు నెలకొంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి అధికార బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ 53 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసింది. కానీ బీజేపీ అభ్యర్థులపై సస్పెన్ష్ వీడలేదు. మొత్తానికి ఆదివారం ఢిల్లీపెద్దలతో రాష్ట్ర నేతలు సమావేశమై పార్టీ 52 మందితో అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర నాయకులు ప్రతిపాదించిన లిస్టుకు నరేంద్ర మోదీ బృందం ఆమోదం వేడంతో ఆ జాబితాను బయటపెట్టారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయాలేంటంటే.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి బరిలో దిగనున్నాడు. నెంబర్ 2 గా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. బీసీలకు సీఎం పదవి అని వినిపిస్తున్న తరుణంలో ఈటల రాజేందర్ ను కేసీఆర్ పై పోటీకి నిలబెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పోటీచేసే 52 మంది అభ్యర్థులు వీరే..
హుజూరాబాద్, గజ్వేల్ – ఈటల రాజేందర్
సిర్పూర్ -పల్లవి హరీష్‌బాబు
బెల్లంపల్లి -శ్రీదేవి
ఖానాపూర్ -రమేష్‌రాథోడ్
ఆదిలాబాద్ -పాయల్ శంకర్
బోథ్ -సోయం బాపురావు
నిర్మల్ -ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
ముథోల్ -రామారావు పటేల్
ఆర్మూర్ -పైడి రాకేష్‌రెడ్డి
జుక్కల్ -అరుణతార
కామారెడ్డి -వెంకటరమణారెడ్డి
నిజామాబాద్ అర్బన్ -ధనపాల్ సూర్యనారాయణగుప్తా
బాల్కొండ -అన్నపూర్ణమ్మ,
కోరట్ల -ధర్మపురి అర్వింద్
జగిత్యాల -బోగ శ్రావణి
ధర్మపురి -ఎస్.కుమార్
రామగుండం -కందుల సంధ్యారాణి
కరీంనగర్ -బండి సంజయ్
చొప్పదండి -బొడిగె శోభ,
సిరిసిల్ల -రాణిరుద్రమ
మానకొండూర్ -ఆరేపల్లి మోహన్
నర్సాపూర్ -మురళీయాదవ్
పటాన్చెరు -నందీశ్వర్‌గౌడ్
దుబ్బాక -రఘునందన్‌రావు
కుత్బుల్లాపూర్ -కూన శ్రీశైలంగౌడ్
ఇబ్రహీంపట్నం -నోముల దయానంద్‌గౌడ్
మహేశ్వరం -అందెల శ్రీరాములుయాదవ్.