Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్ లో 52 మందిని ప్రకటించారు. రెండో జాబితాలో మహబూబ్ నగర్ అభ్యర్థిని మాత్రమే తేల్చారు. ఈ నేపథ్యంలో మూడో జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఫైనల్ లిస్టును ఏ క్షణమైనా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణలు ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తుది జాబితాలో 66 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి తేల్చనున్నారు. ఇప్పటికే ఆలస్యం కావడంతో బీజేపీలోని కొంత మంది ప్రముఖులు ఇతర పార్టీల బాట పట్టారు. దీంతో బుధవారం ఏ సమయానికైనా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Telangana Bjp : నేడు బీజేపీ తుది జాబితా.. ఢిల్లీలో మంతనాలు..
- Advertisment -