Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. అయితే అందరూ ఊహించనట్లు కాకుండా ఒకే ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పేరుకు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. అతి త్వరలోనే మూడో జాబితా రిలీజ్ చేస్తారని అంటున్నారు. అక్టోబర్ 25న బీజేపీ మొదటి లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో 52 మంది పేర్లు ప్రకటించారు. రెండో లిస్టులో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తారని ఊహించారు. కానీ ఒకే ఒక్క పేరు రిలీజ్ చేయడంతో మరింత ఉత్కంఠంగా మారింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులను ఈరోజే ఏ క్షణాన్నైనా రిలీజ్ చేస్తారని అంటున్నారు.
Telangana Bjp : బీజేపీ రెండో జాబితా విడుదల.. ఒక్క స్థానమే ఖరారు…
- Advertisment -