Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్ : తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు మూడో జాబితాను విడుదల చేసింది. గురువారం రాష్ట్ర నాయకులు ఢిల్లీ పెద్దలతో కలిసి తీవ్ర మంతనాలు జరిపిన తరువాత 35 స్థానాలపై తుది నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆక్టోబర్ 22న ఫస్ట్ లిస్టును 52 మందితో బీజేపీ రిలీజ్ చేసింది. రెండో లిస్టును ఒకే ఒక్క స్థానంతో విడుదల చేసింది. ఆ తరువాత మూడో లిస్టులో మొత్తం 66 అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ 35 మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. మిగిలిన వారిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆశావహులు, పార్టీ నాయకులు ఎదురుచూస్తున్న తరుణంలో మూడో జాబితా ను విడుదల చేసింది. ఈరసారి ఆంథోల్ టికెట్ ను మోహన్ బాబు కే కేటాయించారు. అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు. టికెట్ వస్తుందని అనుకున్న విజయశాంతి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మొండి చేయే మిగిలింది. ఆ లిస్టు వివరాలు ఇవే..
